![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో శివాజీ ఎమోషనల్ అయ్యాడు. అతని చేతికి ఎంత నొప్పి ఉన్నా భరిస్తున్నాడు. ఎవరు మాటలన్నా సానుకూలంగా స్పందిస్తూ, నవ్వుతూ పలకరిస్తున్నాడు శివాజీ.
అయితే నామినేషన్లో శివాజీని గౌతమ్ కృష్ణ అన్న మాటలకి అతను బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. నామినేషన్లు పూర్తయ్యాక శివాజీ బెడ్ మీద కూర్చొని ఉండగా.. యావర్ అక్కడ ఉంటాడు. ఇక అతడితో తను అనుభవిస్తున్న నొప్పి గురించి శివాజీ చెప్తాడు. " నేను ఇక్కడ ఉండలేనురా.. రాత్రి నుంచి చాలా దిగులుగా ఉంది.. నా బిడ్డల మీద ఒట్టేసి చెబుతున్నా..
కేవలం మీ ఇద్దరి కోసమే నేను ఇక్కడున్నాను.. లేకపోతే నాగార్జున బాబు గారిని అడిగి ఎప్పుడో వెళ్లిపోయే వాడిని" అంటూ యావర్‌తో చెబుతూ బాధపడ్డాడు శివాజీ. దీంతో వెంటనే శివాజీని హగ్ చేసుకొని.. ఏంటి సార్ మీరు ఇలా అంటారు.. మీరు చాలా స్ట్రాంగ్ అని యావర్ ధైర్యం చెప్పాడు. "నా వల్ల కావట్లేదురా.. నేను స్ట్రాంగే కానీ ఇంత బాధ ఎప్పుడూ అనుభవించలేదని చెప్తూ శివాజీ ఎమోషనల్ అయ్యాడు.
ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ రాగానే. మీ ఇద్దరి కోసమే ఈ హౌస్ లో ఉన్నానురా, నాకు నొప్పి ఉన్నా మీ కోసం ఉంటున్నానంటు శివాజీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గురువు కన్నీళ్ళని చూసిన పల్లవి ప్రశాంత్, యావర్ లు ఏడ్చేశారు. ఇదంతా మోస్ట్ హార్ట్ టచింగ్ గా సాగింది. ఇప్పుడు వీళ్ళకి మరింత ఫ్యాన్ బేస్ పెరిగే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీజన్‌లోను గురుశిష్యుల రిలేషన్ లేదు. మొట్టమొదటి సారి ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య ఒక ప్యూర్ గురుశిష్యుల రిలేషన్ ఉంది. దీనిని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు తెగ ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురిలో ఎవరు నామినేషన్లో వాళ్ళే టాప్ లో ఉంటున్నారు. ఇప్పటికే నామినేషన్లో ఉన్న పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
![]() |
![]() |